Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చేయి ….చేయి…. కలిపి ఇల్లు కట్టేద్దామా??

దళిత నాగరాజు కుటుంబాన్ని అన్ని పార్టీల నాయకులు, ఫౌండేషన్ సభ్యులు సహకారం అందించాలి.

కుటుంబంలో ఆనందం చూడడం సమాజ బాధ్యత.

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ ఇంటి నిర్మాణము లో పెద్దన్న పాత్ర పోషించాలని దళిత ప్రజలు, కుటుంబ సభ్యుల వేడుకోలు.

సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 30 నిజం న్యూస్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ,తొండ గ్రామంలో దళిత కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయి, కష్టాలు అనుభవిస్తూ… విద్యారంగంలో రాణించలేక.. తల్లితో కూలి, నాలి చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న నాగరాజు కుటుంబం దీనస్థితి….. ప్రతిరోజు కూలికి పోతే గాని… డొక్కాడని… పరిస్థితిలో…. గత కొన్ని సంవత్సరాలుగా.. తొండ గ్రామంలో.. ఊరి చివర గ్రామకంఠంలో. గుడిసెలో తల్లితోపాటు, భార్య, ముగ్గురి కుమార్తెలతో.. జీవనం సాగిస్తున్నాడు… గత కొన్ని సంవత్సరాలుగా… బతుకు జీవుడా అంటూ. పనులు లేకపోవడంతో.. హైదరాబాద్, తదితర ప్రాంతంలోనూ… దొరికిన కూలి పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు…

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన, దళిత బంధు పథకానికి అర్హుడు కావడంతో… మనసున్న మారాజు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే, సహకారంతో నాగరాజుకు, దళిత బంధు పథకంలో కారు లోనుకు అర్హుడయ్యాడు.. దీనితో లబ్ది చేకూరినది కానీ… గత కొన్ని రోజులుగా.. ఎంపీడీవో కార్యాలయంలో.. ప్రాసెస్ పూర్తిస్థాయిలో జరగక, ఇంకా కార్ సహాయం చేతి అంద లేదని, ఆవేదన వ్యక్తం చేశారు… దీనికి తోడు ముఖ్యముగా అతడు జీవనోపాధి సాగించే.. ఉండే గుడిసె… ఎండకు ఎండి… వానకు తడిచే విధంగా… తయారై… దీనస్థితికి చేరుకుందని. కనీసం రాత్రివేళలో పడుకునే స్థితిలో లేదని పేర్కొన్నారు.. ముందస్తుగా తొండ, తిరుమలగిరి మండలంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాతలు, సమాజ సేవకులు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారం , పేదల పెన్నిధి, దళిత బాంధవుడు శాసనసభ్యులు డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ పెద్దన్న పాత్ర పోషించి, ఆర్థికపరమైనసహాయసహకారాలుఅందించినట్లయితే కనీసం ఒక రేకుల రూముతో, బాత్రూం తో సహా నూతన గది నిర్మాణం, ఏర్పాటు చేయుటకు కృషి చేయాలని, పేద మనసుతో, దళిత కుటుంబం కోరుతున్నది… చేయి చేయి కలిపి…. ఓ దళిత కుటుంబానికి… ఇల్లు కట్టించాలని… నిజం న్యూస్ తో… తన గోడు విన్నవించుకున్నాడు.