నాలుగు మండలాలకు ఒక్క ఎంఈఓ

ఇబ్బందులు పడుతున్నా విద్యార్దులు….
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో అక్టోబర్ 30(నిజం న్యూస్)
రాజాపేట మండలంలోని ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు హాస్టల్స్ లో సీట్స్ రావడం వల్ల ఎంఈఓ వద్ద నుండి సంతకం తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కన్స్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు బొద్దుల నగేష్ కుమార్ తెలియజేశారు.నాలుగు మండలాలకు కలిపి ఒకే ఎంఈఓ ఉండడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్ పై సంతకం కోసం ఎంఈఓ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఎంఈఓ ఎక్కడ ఉంటే అక్కడి వరకు వెళ్లి ఎంఈఓ సంతకం తీసుకోవాల్సి వస్తుందని ఒక మండలానికి ఒక ఎంఈఓ ఉండాల్సిన పరిస్థితి నుండి నాలుగు మండలాలకు ఒక ఎంఈఓ ను ఇన్చార్జి గా నియమించి అధికారులను మరియు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ను ఏర్పాటు చేసి విద్య వ్యవస్థ విద్యా విధానం సరిగా నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు తెలియపరచడం జరిగింది.నాలుగు మండలాలకు ఒక ఎంఈఓ ఉండడం వల్ల విద్య సంస్థలో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం త్వరగా జరగడం లేదు.వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ను నియమించి విద్యావ్యవస్థలో మానిటరింగ్ ఈ అవసరమైన వ్యవస్థను బలపరచవలసిందిగా కోరారు