విద్యార్థులకు అండ ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్

మాడ్గుల అక్టోబర్29 ( నిజం న్యూస్ ):
మాడ్గుల మండలంలోని అవురుపల్లి జిల్లాపరిషత్ ఉన్నంత పాఠశాలలో 214 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ క్రీడా దుస్తులను అందజేసి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మీరు జీవితకాలం రుణపడి ఉంటారని, ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ పాఠశాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి 2.50 లక్షల నిధులు ట్రస్ట్ ద్వారా కేటాయించి పూర్తి చేయించానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ పాఠశాలకు ఇంకా ఏమైనా వసతులు కావాలంటే తన దృష్టికి తీసుకువస్తే పాఠశాలలో ఉన్న సమస్యను తీరుస్తానని పాఠశాల ఉపాధ్యాయులకువిద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు, నర్సంపల్లి సర్పంచ్ హనుమా నాయక్ ఈ పాఠశాలకు త్వరలో 4 ఫ్యాన్లు అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, మాడుగుల మండల ఎంపీపీ పద్మా రెడ్డి, నర్సంపల్లి సర్పంచ్ హనుమానాయక్, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్రీశైలం గౌడ్, తలకొండపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, శృతిలయ కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ చిత్తరంజన్ దాస్, అవురుపల్లి మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, అవురుపల్లి గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.