కేశపల్లితో కలిసి కాషాయం గూటికి

-మునుగోడులో బిజెపి గెలుపు తథ్యం
బిజెపి మండల ఉపాధ్యక్షుడు కేశపల్లి వెంకట్రాంరెడ్డి
చేవెళ్ల, అక్టోబర్ 25 (నిజం న్యూస్)
చేవెళ్ళ మండలం పల్గుట్ట గ్రామంలో వివిధ పార్టీల నుంచి కేశపల్లి వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. మునుగోడు ఎన్నికల ప్రచారంకు వెళ్లిన వీరిని మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయం కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పల్గుట్ట గ్రామానికి చెందిన మల్గారి మనోహర్ రెడ్డి, మల్గారి మధుసూదన్ రెడ్డి, సాలె మురళి మరికొందరు సభ్యులు కలిసి కేశపల్లి వెంకట్ రాంరెడ్డి, పీసరి గోపాల్ రెడ్డి, సామ రంగారెడ్డి, గుండన్నగారి వెంకట్ రెడ్డి సమక్షంలో కాషాయపు కండువాలు కప్పుకున్నరు. మునుగోడు ఉప్పు ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ బలపరుస్తూ ముమ్మరమైన ప్రచారం నిర్వహించారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని నమ్మేస్థితిలో ప్రజలు ఎవరు లేరని దేశం మొత్తం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని మునుగోడులో బిజెపికి ఓటు వేసి మునుగోడును అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలను కోరారు