అక్రమంగాపిడిఎస్ బియ్యాన్నిరీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్ పై దాడి చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు

పర్వతగిరి :అక్టోబర్ 23 (నిజం న్యూస్)
పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో వేంగమాంబ రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం (రీసైక్లింగ్) పట్టివేత
పీడీఎస్ బియ్యం 350 క్వింటాళ్లు విలువ రూ. తొమ్మిది లక్షల పదివేలు ఉంటుందని పోలీసులు అంచనా
టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి పీఎస్ పరిధిలోని ఎనుగల్లు గ్రామంలో వెంగమాంబ రైస్మిల్లులో అక్రమంగా డంపింగ్/రీసైక్లింగ్ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ బృందం ఛేదించింది. టాస్క్‌ఫోర్స్ బృందం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సిరిపోతు.మల్లయ్య,
ధామెర. సారంగపాణి, దమ్మిశెట్టి .కోటి, .బాణోత్.నవీన్, మదురి.రవీందర్, వీరు చుట్టుపక్కల గ్రామాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి పీడీఎస్‌ను రీసైకిల్ చేసి అధిక ధరకు ఎఫ్‌సీఐకి అధిక ధరలకు సరఫరా చేస్తు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. వారి నుంచి 350 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు సొత్తును పర్వతగిరి పోలీసులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, అడిషనల్ డిఎస్పి
డా. ఎం. జితేందర్ రెడ్డి, ఏసీపీ
ఎన్. వెంకటేశ్వర్లు, వి.నరేష్ కుమార్ ఇన్‌స్పెక్టర్లు, ఎండి.నిసార్ పాషా SI మరియు టాస్క్ ఫోర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు