Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బైండోవర్ తో….. బెంబేలెత్తిన బెల్ట్ షాప్ యాజమాన్యం!

బైండోవర్ తో….. బెంబేలెత్తిన బెల్ట్ షాప్ యాజమాన్యం

ఫుల్ బాటిల్ అమ్మితే…. రెండు లక్షల జరిమానా అట, తెలియక బాండ్ పేపర్ పై, సంతకాలు చేశామని లబోదిబో.

గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రతి బెల్ట్ షాపులను, బందు చేయాలని పలువురి డిమాండ్… కూలి పని చేసి బతుకుతాం మహిళల ఆవేదన…

ప్రభుత్వం కొత్త చట్టం చేసిందని.. ఎక్సైజ్ సీఐ వెల్లడి.

తుంగతుర్తి అక్టోబర్ 22 నిజం న్యూస్

గత కొంత కాలంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్సైజ్ అధికారుల అండదండలతో, వందలకొద్ది షాపులు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఒక్కసారిగా శనివారం ఏమైందో తెలియదు కానీ, గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహిస్తున్న యాజమాన్యం అందరిని, తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి రావలసిందిగా ఎక్సైజ్ సీఐ హుకుం జారీ చేయడంతో…. ఒక్కసారిగా సుమారు 20 మంది బెల్ట్ షాప్ యాజమాన్యం, తమ వాహనాలపై వచ్చి చేరుకున్నారు… ముందస్తుగానే ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ బాండ్ పేపర్ లో ఒక ఫుల్ బాటిల్ అమ్మితే, రెండు లక్షల జరిమానా విధించినట్లు, కేవలం కా టర్ సీసా లు, ఆఫ్ సీసాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం చట్టం చేసిందని, అందులో రాసినట్లు, ఎవరికి చెప్పకుండానే సుమారు 20 మంది బెల్ట్ షాప్ యాజమాన్యం తో సంతకాలు పెట్టించి, ఏకంగా తాసిల్దార్ కార్యాలయం కి పిలిపించారు. దీనితో కోపోద్రిక్తుడైన బెల్ట్ షాప్ యాజమాన్యం మేము మందు అమ్మన్, ఏది అమ్మన్, వైన్ షాపు యాజమాన్యం మా దగ్గర ఒక్క బాటిల్ కు సుమారు 10 నుంచి 15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఎక్సైజ్ కార్యాలయం నుండి వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది తాసిల్దార్ కార్యాలయం నుండి పలాయనం చెందారు.

 

తుంగతుర్తి మండలంలో సుమారు 500కు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తుండగా ,కేవలం మండలంలో మమ్ముల్ని మాత్రమే పిలిచారని, మాపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు వారు మీడియా ముందు ఆరోపించారు. ఏది ఏమైనా గ్రామాల్లో ఒకపక్క ఎక్సైజ్ సిబ్బంది బెల్టుషాపులను ప్రోత్సహిస్తూ, వైన్ షాపులో జోరుగా మామూలు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు..

 

జరిగిన సంఘటనపై స్థానిక ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ ను వివరణ కోరగా…. ప్రభుత్వ ఆదేశాల మేరకు, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న అనుమానితుల పై బైండోవర్ కేసు నమోదు చేస్తున్నట్లు సుమారు 18 మంది పై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు..