రాజగోపాల్ రెడ్డి గెలవాలని లెంకలపల్లి వాసి తిరుపతికి పాదయాత్ర

లెంకలపల్లి,మునుగోడు నియోజకవర్గం,అక్టోబర్ 20 (నిజం న్యూస్)
మునుగోడు ఉపఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంఛార్జిగా ఉన్న లెంకలపల్లి గ్రామం నుండి చిరుమామిళ్ళ గోపి అనే వ్యక్తి తిరుపతికి పాదయాత్ర చేపట్టాడు. యాత్ర మొదలుపెట్టి నేటికి పదిరోజులు పూర్తయిందని,కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని రాళ్లపెంట గ్రామం చేరుకున్నట్లుగా గోపి తెలిపారు.తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుని రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం స్వామివారిని వేడుకుంటానని తెలిపారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాడని అభిమాని తెలిపారు.