యాదవుల పై బిజెపి కుట్రను సాగనివ్వం

డీసీఎంఎస్ చైర్మన్ వట్టి, జానయ్య యాదవ్.
ధర్నా లో జానయ్య యాదవ్ అరెస్ట్, విడుదల!
జనగం క్రాస్ రోడ్డు వద్ద బిజెపి డౌన్… డౌన్ అంటూ నినాదాలు, ధర్నా, నిలిచిపోయిన వాహనాలు, బిజెపి కుట్రను సాగనివ్వం…
సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 20 నిజం న్యూస్
రెండో విడత గొర్రెల పంపిణీ, నగదు బదిలీని యాదవకులకు చెంద కుండ, అడ్డుకున్న బిజెపి ని మునుగోడు ఎన్నికలలో ఓడిించాలని గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు వద్ద భారీ నిరసన, రాస్తో రోకో చేసిన యాదవ సంఘం నాయకులు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ని, పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.వట్టె జానయ్య యాదవ్ నీ వెంటనే విడుదల చేయాలని, యాదవ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించగా వెంటనే ఆయనను విడుదల చేశారు.