జన సంద్రమైన మర్రిగూడ

బండి సంజయ్ రోడ్డుషోకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు.
మర్రిగూడ,అక్టోబర్ 18,(నిజం న్యూస్)
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర రథ సారధి బండి సంజయ్ రోడ్డుషో సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.వివిధ గ్రామాల నుండి వచ్చిన బీజేపీ అభిమానుల హర్షద్వానాలతో మర్రిగూడ రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి.హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించి పోలీసులు ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు.