రుద్రమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ఇరువురు గల్లంతు

మృతదేహాల కోసం చెరువులో గాలింపు చేపట్టిన గ్రామస్తులు.
తుంగతుర్తి అక్టోబర్ 17 నిజం న్యూస్
రుద్రమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ఇరువురు వ్యక్తులు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామ శివారులో గల రుద్రమ్మ చెరువులో చోటుచేసుకుంది….
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒకరు జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి గ్రామానికి చెందిన భూక్య వీరు34 మరొకరు వీరు దగ్గర బంధువైన ఆత్మ ఆత్మకూర్ ఎస్ మండలం లౌడియా తండాకు చెందిన భూక్య బిచ్చు33 గా బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.గాలింపు చెర్యలు చేపట్టిన పర్సాయపల్లి గ్రామస్తులు. జరిగిన సంఘటనపై తుంగతుర్తి తాసిల్దార్ రాంప్రసాద్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. బొల్లంపల్లి గ్రామస్తులు చెరువులో మృతదేహాల కోసం గాలింపు చేపడుతున్నారు. రుద్రమ్మ చెరువు వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటనను జిల్లా ఉన్నతా అధికారులకు తెలియపరిచిన అధికారులు తెలిపారు…