Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆర్యవైశ్య కార్పొరేషన్ తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి

తుంగతుర్తి మెయిన్ బజార్ లో ర్యాలీ నిర్వహించిన మండల ఆర్య వైశ్యులు.

తుంగతుర్తి, అక్టోబర్ 16 నిజం న్యూస్

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి, తుంగతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మండల ఆర్య వైశ్యులు ఆర్యవైశ్య కార్పొరేషన్ ..మా లక్ష్యం అనే నినాదంతో, ప్లే కార్డు లు చేతబూని, మెయిన్ రోడ్డు పై ర్యాలీ నిర్వహించి, మెయిన్ సెంటర్ లో ప్రభుత్వం తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాంతారావు, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓరుగంటి సత్యనారాయణ లు మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ తో రానున్న రోజుల్లో మధ్యతరగతి పేద ఆర్యవైశ్యుల కోసం విద్య వైద్యం ఉపాధి లక్ష్యంతో పని చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్య వైశ్యులు పదవులు విడనాడి, ఆర్యవైశ్య కార్పొరేషన్ లక్ష్యంతో పని చేసి ప్రభుత్వం తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు సాధన ప్రక్రియ జరిగే విధంగా కృషి చేయాలని కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు, ప్రతి ఆర్యవైశ్యులు బాధ్యతతో, పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న వైశ్య నాయకులు, కార్పొరేషన్ ఏర్పాటు లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని చొ తమ పదవులకు రాజీనామా చేసి, ఉద్యమ పోరాటం లో పాల్గొనక, తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు బండారు దయాకర్, ఓరుగంటి అంతయ్య, పోలవరపు సంతోష్, బండారు సోమన్న, సత్యనారాయణ, ఓరుగంటి శ్రీనివాస్, సుభాష్, ఈగ నాగన్న, శ్రీను,, తల్లాడ కేదారి, బిక్షం, శ్రీనివాస్, గోపవరపు సత్యనారాయణ, బుద్ధ వీరన్న, బండారు నాగన్న, వెంకన్న, రాజు, కృష్ణమూర్తి, సోమన్న, తదితర ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.