Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశ రక్షణ లో యువత భాగస్వామ్యం కావాలి

 

దేశ ప్రజలు క్షేమంగా ఇళ్ళలో ఉంటున్నారంటే దానికి కారణం రక్షణ బలగాలే.

కల్నల్ సంతోష్ బాబు స్పూర్తి తో సైన్యం లో చేరాలనుకునే స్థానిక యువత కోసం సూర్యాపేట లో రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించిన అధికారులకు ధన్యవాదాలు

సైన్యం లో చేరాలనుకునే ఆసక్తి గల యువత కు సూర్యాపేట లో నిర్వహిస్తున్న రిక్రూట్ మెంట్ ర్యాలీ సదవకాశం

రిక్రూట్ మెంట్ ర్యాలీ కి అన్ని ఏర్పాట్లు పూర్తి

ర్యాలీ లో పాల్గొంటున్న రాష్ట్రం లో ని 33జిల్లా ల నుండి 45 వేల మంది పైగా యువత

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల .జగదీశ్వర్రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 15 నిజం న్యూస్

దేశ రక్షణ కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని దేశ రక్షణ లో భాగస్వామ్యం కావాలనుకుంటున్న యువత కోసం సూర్యాపేట లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నీ తీసుకురావడం జరిగిందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక యువత కోసం తాము కోరిన వెంటనే సూర్యాపేట లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి అంగీకరించిన ఆర్మీ అధికారుల కు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞత లు తెలిపారు.. సూర్యాపేట లోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆర్మీ ర్యాలీ లో పాల్గొనే యువత కోసం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన స్టాల్ ను మంత్రి ప్రారంభించారు.. అనంతరం మాట్లాడుతూ దేశ రక్షణ బాధ్యత మనందరిిదని అన్నారు. దేశ రక్షణ లో ప్రధాన పాత్ర యువత దే నన్న మంత్రి అందుకు ముందుకు వచ్చే యువకులకు సూర్యాపేట లో నిర్వహిస్తున్న రిక్రూట్ మెంట్ ర్యాలీ సదవకాశం అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల నుండి దేశానికి రక్షణ కల్పిస్తున్న ఘనత , దేశం లో ప్రతీ ఒక్కరం తమ ఇళ్లలో సంతోషం గా ఉంటున్నమంటే దానికి ప్రదనట్ కారణం రక్షణ బలగాలే అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.నేటి నుండి ప్రారంభమైన రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 31 వరకు 15 రోజుల పాటు కొనసాగనుందన్నారు.. ఈ ర్యాలీ లో రాష్ట్రం లోని 33 జిల్లా ల నుండి సుమారు 45వేల మంది కి పైగా యువత పాల్గొననున్నారని మంత్రి తెలిపారు. సెలక్షన్ లో పాల్గొనే యువతీ, యవకుల కు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి అన్నారు . ఈ సందర్భంగా ఆర్మీ ప్రవేశం కోసం ర్యాలీ లో పాల్గొంటున్న యువతీ యువకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమం లో ఎం. ఎల్. సి కోటి రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ, కౌన్సిలర్లు శబరి, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి గౌడ్, గుడిపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.