పోలీస్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అభ్యర్థులకు బస్సు సౌకర్యం

భద్రాచలం ఏ ఎస్ పి రోహిత్ రాజ్

చర్ల అక్టోబర్ 14 ( నిజం న్యూస్) గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లుభద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చర్ల నుండి ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ బి అశోక్ తెలిపారు అభ్యర్థుల సౌకర్యం కొరకు చర్ల దుమ్ముగూడెం మండలాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తే వారికి సౌకర్యాలు ఏర్పాట్ల కొరకు సహకరిస్తామని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు