పిడుగుపాటుకు ఇంటికి రంధ్రం

*భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు*
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో అక్టోబర్ 15(నిజం న్యూస్)
మోటకొండూరు మండలంలోని తేర్యాలలో శనివారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంట ప్రాంతం లోకురిసిన వర్షంలో మంత్రి సోమయ్య ఇంటి స్లాబ్ పై పిడుగు పడి పెచ్చులూడినాయి.ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉండడంతో భయభ్రాంతులకు గురైనారు.ఇంట్లో 3 ఫ్యాన్లు,టి వి సెటాప్ బాక్స్ లు కాలిపోయినాయి,పక్కకున్న ఇండ్లపై పిడుగు ప్రభావంతో భూమి ప్రకంపనలు కనిపించినట్లు తేలుపుతున్నారు.ఏది ఏమైనా ప్రాణ నష్టం జరగలేదని పిడుగు పడి పెచ్చులూడిన ఇంటిని చూడడానికి బారీగా కదిలారు.