ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే లేడా!!

చింతపల్లి అక్టోబర్15 (నిజం న్యూస్)

చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామంలో ఈ రోడ్డును పట్టించుకునే నాధుడే లేడా అంటూ కుర్మేడ్ ఎక్స్ రోడ్ నుండి బ్రాహ్మణపల్లి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిన దాన్ని పట్టించుకునే నాధుడే లేడు. గత 15 సంవత్సరాల నుండి ఈ రోడ్డు గుంతల మయంగా మారడం వలన ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు కోరారు. ఈ రోడ్డు గురించి ప్రజాప్రతినిధులకు ఎన్నో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన దరఖాస్తును తీసుకొని ఒక చిత్తుకాగితాలు లాగా పక్కకు వేస్తూ ఈ రోడ్డు సమస్యలు పట్టించుకోవడం లేదు, ఈ రోడ్డు నుండి పాలు గ్రామాలకు రవాణా ఎక్కువగా ఉండటం వలన వెళ్లే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజాప్రతినిధులు పట్టించుకోని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఈ రోడ్డుకు మట్టి పోయించారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూశారు, కానీ మళ్లీ అకాల వర్షాల వల్ల రోడ్ ఎప్పటిలాగే గుంతల మయంగా మారింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం ఏ చలనం లేకుండా ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు, దయచేసి మా కుర్మేడ్ రోడ్డు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులను కోరారు.