మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పత్రికా విలేకరి దామెర ఉత్తరయ్య

చండూర్, మునుగోడు నియోజకవర్గం, అక్టోబర్ 14 (నిజం న్యూస్)

నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన దామెర ఉత్తరయ్య మునుగోడు ఉపఎన్నికకు స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరు ప్రస్తుతం వార్డు సభ్యునిగా కొనసాగుతున్నారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.వీరు వృత్తి రీత్యా పత్రికా విలేఖరి. ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కు వెళ్ళేముందు డప్పు చప్పుల్లతో, అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు.