ఈ పాపం ……ఎవరిది??

విద్యుత్ అధికారుల దౌర్జన్యం….వీధి దీపాల కిందనే జీవనం.
విద్యుత్ ఏ ఈ తో పాటు ,సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని పేద ప్రజల డిమాండ్.
తిరుమలగిరి అక్టోబర్ 14 నిజం న్యూస్
తిరుమలగిరి మండల విద్యుత్ ఏఈ తో పాటు అధికారుల దౌర్జన్యం నిర్లక్ష్యం మూలంగా గత రెండు రోజులుగా ఒక నిరుపేద కుటుంబం వీధి దీపం కిందనే జీవనం సాగిస్తున్న సంఘటన గురువారం రాత్రి తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
తొండ గ్రామానికి చెందిన నీరటి శోభ నిరుపేద కావడంతో విద్యుత్తు అధికారుల దౌర్జన్యం బెదిరింపుల మూలంగా తాను అద్దెకు ఉన్న ఇంటి విద్యుతును తొలగించడంతో ఆ ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆ దే వీధిలో ఉన్న వీధి దీపం కిందనే వంట చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల దగ్గరి బంధువు చనిపోవడంతో శాస్త్రీయంగా ఆ ఇంటిని నెల రోజులుగా విడిచి పెట్టాలని చెప్పడం మూలంగా తాను ఉన్న ఇంటిని, కాళీ చేసి అదే గ్రామంలోని మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నానాని తెలిపారు తిరుమలగిరి విద్యుత్ ఏఈ తో పాటు, లైన్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఆ సిబ్బందితో శోభ ఇంటికి ఉన్న బిల్లును కట్టలేదని అద్దె ఉన్న ఇంటి సర్వీసు వైర్ ను తొలగించడంతో, ఆ ఇంటి యజమాని మీ కారణంగానే నా ఇంటిని విద్యుత్ తొలగించారని ఇంటి నుండి గెంటివేశాడు. దీంతో చేసేది ఏమీ లేక బాధితురాలు గత రెండు రోజుల క్రితం విద్యుత్ అధికారిని తాను త్వరలోనే బకాయి చెల్లిస్తానని చెప్పిన వినకుండా అద్దెకు ఉన్న ఇంటి సర్వీసు తొలగించారని ఆరోపించింది . అద్దె ఇంటి యజమాని నీ ములంగా మా యొక్క ఇంటి సర్వీసును తొలగించారని వెళ్లిపొమ్మని బయటకి గెంటివేయడంతో చేసేదేమీ లేక రెండు రోజులుగా చీకట్లోనే జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అసలే వర్షాకాలం పాములు తేళ్లు ఇతర విషపురుగులు సంచరిస్తుండటంతో తాము తమ పిల్లలతో దిక్కు మిక్కు బంటు ప్రాణభయంతో ఉ న్నామని తెలిపారు తమ ఇంటికి సర్వీసను అకారణంగా తొలగించిన విద్యుత్ ఏ ఈ, సంబంధిత బాధ్యులను సస్పెండ్ చేయాలని బాధితురాలు తెలిపింది. జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, తమకు న్యాయం చేయాలని కోరారు.