చేనేత సహకార సంఘాల్లో గతంలో చనిపోయిన సంఘ అధ్యక్షుల సంస్కరణ సభలను కూడా నిర్వహించాలి….. బిజెపి పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్

చేనేత సహకార సంఘాల్లో గతంలో చనిపోయిన సంఘ అధ్యక్షుల సంస్కరణ సభలను కూడా నిర్వహించాలి….. బిజెపి పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో అక్టోబర్ 13 (నిజం న్యూస్)
ఆలేరు : ఆలేరు చేనేత సహకార సంఘం లో జరిగిన చింతకింది వెంకటేష్ సంస్మరణ సభను అభినందిస్తూ, పురస్కరించుకొని గురువారం ఆలేరు బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ మాట్లాడుతూ ఆలేరు చేనేత సహకార సంఘం వ్యవస్థాపకులు చింతకింది జగన్నాథం మరియు చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్ చిట్టి మెల్ల మల్లయ్య లు కూడా పదవిలో కొనసాగి మరణించడం జరిగిందన్నారు. చింతకింది వెంకటేష్ సంస్మరణ సభలను నిర్వహించినట్లుగానే చింత కింది జగన్నాథం , చిట్టిమిల్ల మల్లయ్య సభలను కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చిట్టి మిల్ల మల్లయ్య తన సొంత భూమిని 1/2 ఎకరం ఇవ్వడంతోపాటు , సంఘ భవనాన్ని కూడా అందించడం జరిగిందని జహంగీర్ గుర్తు చేశారు. మార్కండేయ కాలనీ నిర్మాణానికి అప్పటి చేనేత సహకార సంఘం చైర్మన్ చిట్టి మిల్ల మల్లయ్య ప్లాట్ల పంపకానికి, ఇండ్ల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన సేవలను మనం గుర్తించాలని ఆయన కోరారు.,సిల్క్,కాటన్ సొసైటీ లో కూడా ఇదే మాదిరిగా చనిపోయిన చైర్మన్ ల సంస్మరణ సభలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పలువురు మాట్లాడుతూ సంఘ వ్యవస్థాపకులు చింతకింది జగన్నాథం, చిట్టిమల్లె మల్లయ్య తదితరుల సంస్మరణ సభలను జయంతులను,వర్ధంతిలను కూడా నిర్వహించాలని కోరారు. గతంలో చైర్మన్లు సొసైటీలకు చేసిన సేవలను గుర్తు చేశారు.