అంశాల స్వామి ఇంటిలో మంత్రి కేటీఆర్

స్వామి కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆర్థిక సాయం అందజేసిన మంత్రి కేటీఆర్.
మునుగోడు సెప్టెంబర్ 13 నిజం న్యూస్
మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా ఉంటానని స్వామి కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు.
గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని మంత్రి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయించారు. ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ పర్యటన తో స్వామి ఇంట్లో, కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.