Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలల సంరక్షణ అందరి బాధ్యత

బాలల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 13 నిజం న్యూస్

జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు

. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల సంరక్షణ బాలల హక్కులు కాపాడుట కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో పనిచేసే ఉద్యోగినులు పిల్లల సంరక్షణ పిల్లల ఎదుగుదల , అభివృద్ధి ప్రేరణ కోసం బాలల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు ఈ సంరక్షణ కేంద్రంలో సేవలు పొందవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ బాలల సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆర్ డి ఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి, సిడిపివోలు శ్రీజ, విజయ చంద్రిక, జిల్లా కార్యాలయ సూపర్డెంట్ హుస్సేన, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.