ధరావత్ నిఖిల్ నాయక్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట ప్రతినిధి, అక్టోబర్ 12 నిజం న్యూస్
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రోజు నిరసన వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నాయకులు.
మాజి కౌన్సిలర్ ధరావత్ భాస్కర్ నాయక్ కుమారుడు ధరావత్ నిఖిల్ నాయక్ ను దారుణంగా హత్య చేసి శవాన్ని సాగర్ కాలువలో పడేసిన సంఘటన గిరిజన జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. అక్టోబర్ నెల 9 వ తేదిన రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన నిఖిల్ ను దారుణంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితులను ఇప్పటి వరకు గుర్తించలేదని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంటనే నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
గిరజన బిడ్డను హత్య చేస్తే పోలీసు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు వాంకుడోతు వెంకన్న, డాక్టర్ రమేష్ నాయక్, ధరావత్ వీరన్న నాయక్, బాణోతు లచ్చిరాం నాయక్, రాజేష్ నాయక్, వెంకటేష్ నాయక్, నాగు నాయక్, గగులోతు బాలాజి నాయక్, కాలారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.