మహిళా విఆర్ఎల అక్రమ అరెస్టు అమానుషం

తుంగతుర్తి అక్టోబర్ 11 నిజం న్యూస్
రాష్ట్ర విఆర్ఎల జేఏసీ పిలుపు మేరకు, గత కొన్ని రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చే పడుతున్న తరుణంలో మంగళవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహిళల వీఆర్ఏల చేత బతకమ్మ ఆట పాట తో నిరసన కార్యక్రమం ఉన్నందున, దీన్ని ప్రభుత్వం గమనించి ముందస్తుగానే ఉదయం 4 గంటలకు, మహిళా విఆర్ఎల కుటుంబాల వద్దకు వెళ్లి పోలీసులు వారిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు చేయడం ఆ ప్రజాస్వామ్యమని వీఆర్ఏలు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళ విఆర్ఏలు ధనమ్మ, నాగమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.