హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఔదార్యం

రాజ్కుమార్ పోగొట్టుకున్న బ్యాగును విస్టింగ్ కార్డు సహాయంతో కనిపెట్టి ,హెడ్ కానిస్టేబుల్ రమేష్ అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం.
సమాజంలో పోలీసు సిబ్బంది సేవలు భేష్.
సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 11 నిజం న్యూస్
ఓ వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగ్ ను విసిటింగ్ కార్డ్ ద్వారా ఆచూకీ కనిపెట్టి తిరిగి అప్పగించి తన ఔదార్యం చాటుకున్నారు హెడ్ కానిస్టేబుల్ రమేష్. .
కాకరవాయి గ్రామానికి చెందిన
సలిగంటి రాజ్ కుమార్ బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా టేకుమాట్లా చెక్ పోస్ట్ వద్ద బైక్ పై బ్యాగ్ కింద పడిపోయింది. బ్యాగ్ గమనించకుండా వెళ్లిన రాజ్ కుమార్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ రోడ్ పై పడి ఉన్న బ్యాగ్ ను గమనించగా అందులో విలువైన వస్తువులు ఉండడంతో అందులో ఉన్న విసిటింగ్ కార్డ్ ఆధారంగా నెంబర్ కు సంప్రదించగా, మరిపెడ గ్రామంలోని ఫర్నిచర్ కి చెందిన వ్యక్తి ద్వారా ,రాజ్ కుమార్ కి సమాచారం అందిచాగా రాజ్ కుమార్ టేకుమాట్లా చెక్ పోస్ట్ వద్ద బ్యాగ్ తీసుకున్నారు.
ప్రస్తుత సమాజంలో వస్తువు దొరికితే తమ వద్దనే ఉంచుకుంటున్న రోజులలో విలువైన ఉన్న బ్యాగ్ ను నిస్వార్థంగానిజాయితీగా అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ కు రాజకీయాలకతీతంగా రాజకీయ నాయకులు ,మేధావులు, ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జయహో… పోలీస్.