తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల ధర్నా

రిజిస్ట్రేషన్ కొచ్చి, వెనుతిరిగి పోతున్న …రిజిస్ట్రేషన్ దారులు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు
తుంగతుర్తి అక్టోబర్ 10 నిజం న్యూస్
గత కొంతకాలంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయం ఎదుట గేటు ముందు ధర్నా చేస్తూ, లోపలికి రెవెన్యూ అధికారులు రాకుండా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనితో కొంతమంది రిజిస్టర్ దారులు రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చి నట్లు వాపోయారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. ధర్నా స్థలానికి ఎస్సై డానియల్ కుమార్ వచ్చి అధికారులను ఇబ్బంది పెట్టొద్ తక్షణమే ఈ ప్రదేశం నుండి వెళ్లిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు.