విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

కంగ్టి, అక్టోబర్ 09 (నిజం న్యూస్)

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి కె గ్రామ శివారులో విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కంగ్టి సిఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ ఈశ్వర్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కడమంచి అంజన్న , మొండి రాజు, అండ్రసి రవి,తో పాటు ముక్రంబాద్ గ్రామానికి చెందిన ఇస్మాయిల్, వీరు నలుగురు కలిసి చేపలు ఎండ్రి కాయలు పట్టడానికి వెళ్లడం జరిగింది.జంమ్గి గ్రామ పురం అంజన్న పత్తి చేను దాటుతుండగా

బోర్ మోటారు సర్వీస్ వైర్ తెగిన దాన్ని గమనించక కాలుకు తగలడం తో మద్నూర్ గ్రామ వాసి అండ్రసి రవి (20) అక్కడికక్కడే మృతి చెందాడు.

మొండి రాజు ను విద్యుత్ షాక్ తగలడంతో హుటాహుటిన 108 వాహనంలో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి సిబ్బంది మొండిరాజు ను గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. అండ్రసి రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువైన కడమంచి అంజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.