విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గేదె మృతి

కేశంపేట అక్టోబర్ 07(నిజం న్యూస్)
కేశంపేట మండలంలోని వేములనర్వ గ్రామానికి చెందిన చాకలి దర్శన్ అనే రైతు గత కొన్ని నెలల క్రితం విద్యుత్ అధికారుల ను సంప్రదించి అగ్రికల్చర్ డి డి తీసి సంబంధిత అధికారుల కు డి డి ఇవ్వడం జరిగింది,
కానీ రైతుకు సంబంధించిన
పోల్స్, కేబుల్ ఇవ్వక పోవడంతో రైతు అధికారులను నిలదీసి అడగగా అధికారులు నీ కంటే
ముందుగా చాలా మంది రైతులు డిడి చెల్లించి ఉన్నారు వాల్ల కు ఇచ్చిన తర్వాత చూదాము అని నిర్లక్ష్యంగా సమాధానము ఇచ్చారు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక
గేదె మృతిచెందింది,
కాని ఆయా చుట్టు పక్కల
మనుషుల తిరుగుతూ ఉంటారు,
వారి పరిస్థితి భయాందోళనంగా మారింది,
కాబట్టి ఇప్పటికైన విద్యుత్ అధికారులు స్పందించి
రైతుల కు తగు న్యాయం చేయగలరని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు