రాష్ట్ర ప్రజల సొమ్మును సొంత విలాసాలకు వాడుకుంటున్న కెసిఆర్

వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి
చేవెళ్ల బిజెపి ప్రధాన కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి
చేవెళ్ల, అక్టోబర్ 06 (నిజం న్యూస్) సీఎం కేసీఆర్ తన విలాసవంతమైన జీవితం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పెలగా ఖర్చు చేస్తున్నారని చేవెళ్ల బిజెపి ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి అన్నారు.
కాలేశ్వరం పేరిట దోచుకొని కూడబెట్టిన కోట్లు పెట్టి సీఎం కేసీఆర్ విమానం కొన్నారని ఆరోపించారు చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలు ప్రజాధనం వృథా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో గత 75 రోజులుగా వీఆర్ఎలు సమ్మె చేస్తుంటే పట్టించుకోని కేసీఆర్ తాను గాల్లో తిరగడానికి ప్రజాధనంతో విమానం కొన్నారని ఆరోపించారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరడం కోసం ఇసుక, మొరం కంకర గుట్టలు మాయం చేసి గాలి మోటార్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. రైతుల బాధలు వీఆర్ఎల సమస్యలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలనే పరిష్కరించలేని టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ కు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని సూచించారు