దోమలో ఘనంగా దసరా ఉత్సవాలు

దోమ, అక్టోబర్ 6 (నిజం న్యూస్) దోమ మండలకేంద్రంలో బుధవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి గ్రామపంచాయతి కార్యాలయం నుండి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరు అయి జమ్మి చెట్టుకు పూజ కోసం ర్యాలీగా వెళ్లారు” షమి” పూజ అనంతరం ఒకరికొకరు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ కె రాజిరెడ్డి రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లక్ష్మయ్య తెరాస పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ డైరెక్టర్ యాదయ్య గౌడ్ వార్డ్ సభ్యులు తెరాస నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు