ఉదృతంగా ప్రవహించిన గోడుగొనిపల్లి పెద్ద వాగు

మూడు గంటల పాటు వాహనాలు అంతరాయం
దోమ, అక్టోబర్ 6 (నిజం న్యూస్) దోమ మండల పరిధిలోని గొడుగోని పల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్ద వాగు రోడ్డు పై నుండి ప్రవహించింది. సుమారు 3 గంటల పాటు వాహనాలకు అంతరాయం కలిగింది. వాగు రోడ్డు పై నుండి వెళ్లడంతో వాహనదారుల వర్షంలో ఇక్కట్లు పడ్డారు. గ్రామస్తుల సమచారం మేరకు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని వాగు ఉదృతి పరిశీలించి వాగు తగ్గిన తర్వాత అక్కడి నుంచి వాహనదారులను పంపించారు.అక్కడ ఉన్న గ్రామస్తులకు పోలీస్ సిబ్బంది కొన్ని సూచనలు ఇచ్చారు. వాగు ఉధృతి తగ్గే వరకు ఎవరు కూడా వాగులో దిగవద్దని, కరెంటు స్తంభాల నుంచి దూరంగా ఉండాలని పాడు పడ్డ ఇళ్లల్లో ఉండవద్దని, భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.