Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్పీకర్ సారు జెరా ఇదర్ దేఖో!!

పలుమార్లు హెచ్చరించిన మారని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు!!!

తూతూ మంత్రంగా చర్యలతో నోటీసులను లైట్ తీసుకుంటున్న సిబ్బంది!!!!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 06( నిజం న్యూస్) అభివృద్ధి ,ప్రజా సంక్షేమమే ద్వేయంగా ఏడు పదుల వయసులోనూ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినట్లు తిరుగుతాడు స్పీకర్ పోచారం ఆయన పర్యటనలను చూసి యావత్తు తెలంగాణలోనే ప్రజా ప్రతినిధులు ,ప్రజలు ఆశ్చర్య పోతారు అలాంటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో మాత్రం అక్కడక్కడ ప్రభుత్వ సిబ్బంది అవినీతి విధుల పట్ల నిర్లక్ష్యo లంచగొండి తనం వెలుగుచూస్తున్నాయి ఇందుకు నిదర్శనం బీర్కుర్ ప్రాథమిక ఆసుపత్రిలోని సంఘటన గత వారం రోజుల క్రితం బీర్కుర్ మండలం కిష్టాపూర్ కు చెందిన కుమ్మరి విఠల్ తన కూతురు ప్రసవం కోసం ప్రాథమిక ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు అయితే డెలివరీ అయిన తర్వాత డబ్బుల కోసం అక్కడి సిబ్బంది తనను వేదించినట్లు కాళ్ళ మీద పడి ప్రదేయ పడిన కనికరించలేదు వాపోయాడు.

ఒక వైపు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో నే ప్రసవాలు జరిగేందుకు కృషి చేస్తూ కెసిఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కొందరు సిబ్బంది తీరు వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందని బాధితులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇట్టి విషయమై ఆసుపత్రి వైద్యుడు అఖిల్ ను వివరణ కోరగా సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు వారం రోజులు అవుతున్న ఈ విషయం బయటకు పొక్కకపోవడం వెనుక ఒక ప్రజా ప్రతినిధి అస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్తానికులు స్పీకర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు