తుంగతుర్తి లో తెరాస, బీజేపీ పార్టీ ల మధ్య ఘర్షణ

తుంగతుర్తి లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయిబాబ తోపాటు, పలువురికి గాయాలు .
బీజేపీ నాయకుల పై దాడులు అమానుషం.
బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు
తుంగతుర్తి అక్టోబర్ 6 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర టిఆర్ఎస్ ,బిజెపిల నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయిబాబ తో పాటు, పలువురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానిక సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు మాట్లాడుతూ కావాలని టిఆర్ఎస్ నాయకులు కక్ష పూరితమైన వాతావరణం నెలకొల్పే, దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో దళితుడు రాజకీయంగా ఎదుగుతున్నాడు అని ఓర్వలేకనే టార్గెట్ చేసి దాడులు ఉసిగొల్పిన ట్లు పేర్కొన్నారు. రామాలయ ప్రాంతంలో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు గడచిన 50 సంవత్సరాల చరిత్ర లో ఏనాడు ఇటువంటి దుర్మార్గమైన దాడులు జరగలేదని అన్నారు. ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ నుండి పూజా సామాగ్రి తీసుకొని, రామాలయం వద్దా జమ్మి పూజ చేయడం జరుగుతుంది. మీసం పూజ చేయుటకు పూజారిని కూడా లేకుండా చేశారని అన్నారు. కావాలని పరిస్థితులను తారుమారు చేసి టిఆర్ఎస్ నాయకులు దాడులు చేశారన్నారు. దాడులు చేసిన వారిపై, తక్షణమే జిల్లా ఎస్పీ జరిగిన సంఘటనపై విచారణ జరిపి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని బిజెపి నాయకులు, డిమాండ్ చేశారు.