మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదుకు నేడే చివరి తేదీ

మర్రిగూడ, అక్టోబర్ 04, (నిజం న్యూస్)
మునుగోడు నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి నేడు చివరి తేదీ అని సంబంధిత అధికారులు తెలిపారు.
2004 జనవరి 01 వ తేదీకంటే ముందు జన్మించిన,18 ఏళ్ళు నిండిన యువతి యువకులు పదవ తరగతి మెమో, స్థానిక చిరునామాతో కలిగిన ఆధార్ కార్డ్/వంట గ్యాస్ బిల్/కరెంట్ బిల్లుతో మీ సేవా, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
గత నెల సెప్టెంబర్ 30వ తేదీ వరకు 20,181 మంది కొత్త ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది.