ఆలేరు లో రెండు కోట్లు విలువ చేసే గంజాయి పట్టివేత

ఆలేరు అక్టోబర్ 3 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రకాష్ గార్డెన్ వద్ద ఆలేరు పోలీసులు తనిఖీలు చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం లోని మల్కన్ గిరి నుండి మహారాష్ట్ర కు తరలిస్తుండగా ఆలేరు సరిహద్దు తనిఖీలో పట్టుబడ్డ గంజాయి డి.సి.ఎం.వ్యానులో కొబ్బరి బస్తాల మధ్యలో గంజాయి సంచులు పెట్టి 900 కిలలో గంజాయినీ తరలిస్తుండగా ఆలేరు పోలీసులకు పట్టుబడ్డారు.దిని విలువ సుమారు 2 కోట్ల రూపాయల వరకు వున్నట్లు సమాచారం.