సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ రావును పరామర్శించి, 20,000 ఆర్థిక సహాయం అందజేసిన ౼ మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్

మర్రిగూడ, అక్టోబర్ 03, (నిజం న్యూస్)
మర్రిగూడ మండలంలో ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ అందరి ప్రేమాభిమానాలు అందుకున్న సతీష్ చందర్ రావుకి కాచిగూడ TX హాస్పిటల్ లో బ్రెన్ సర్జరీ కావడంతో విషయం తెలుసుకున్న మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్ ఆసుపత్రికి వెళ్లి , సతీష్ చందర్ రావుని పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తక్షణ సహాయం కింద Rs/-20,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. సతీష్ చందర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలియజేసి, రాజ్ గోపాల్ రెడ్డి ద్వారా కుటుంబానికి అన్నివిధాలా సహాయం సహకారం అందేలా చేస్తానని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.తమకు సహాయం అందించిన రాజు గౌడ్కు సతీష్ చందర్ రావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.