తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనం

సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపికయుగంధర్ రావు

ఘనంగా సద్దుల బతుకమ్మ

తీరొక్క పూలతో అలరించిన బతుకమ్మలు

ఆటాపాటలతో చెరువుల్లో నిమజ్జనం..

తుంగతుర్తి, అక్టోబర్03 నిజం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తంగేడు, గునుగు, టేకు, గుమ్మడి, కలువ బంతిపూల తోపాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను ఇంటింటా తయారు చేసి గౌరమ్మతో పూజించారు. మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు బతుకమ్మను పేర్చి గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మలను ఎత్తుకొని డప్పుచప్పుళ్లతో మైదానాలకు తరలివెళ్లి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ వేడుకలను ఎంపీపీ గుండ గాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, క పూలమ్మ, అనురాధ, మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, బిజెపి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజుల మహేందర్, దొంగరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, కోదాటి అజయ్ కుమార్, తోపాటు ఆయా గ్రామాల ఎంపీటీసీ, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు వేడుకలను తిలకించారు. ఎస్‌ఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ సిబ్బందితో ఏర్పాట్లను పర్యవేక్షించారు.