కారు ఆటో ఢీకొని ఇరువురు మృతి,పలువురికి గాయాలు

తుంగతుర్తి అక్టోబర్ 1 నిజం న్యూస్
నేషనల్ హైవే 365 పై శుక్రవారం రాత్రి అన్నారం వెళ్ళుటకు రోడ్డు ఎక్కుతున్న ఆటోను, అరవపల్లి నుండి మహబూబాద్ వెళుతున్న కారు, ఢీకొట్టడంతో అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోవడం జరిగింది. మిట్టగడుపుల మనోజ్ ( 23 ) తండ్రి రాములు, మిత్తగడుపుల మనోజ్ ( 17 ) శ్రీను మృతి చెందారు. గాయాల అయినవారు మిత్తగడుపుల నవీన్,పాల్వాయి వెంకటేష్,మిట్టగడుపుల రవి. ముగ్గురికి తీవ్ర గాయాలు, ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుపుతూ జరిగిన సంఘటనపై,విచారణ చేపట్టినట్లు ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపారు.