గర్భిణీ స్త్రీల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్

*చోద్యం చూస్తున్న అధికారులు
*చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 30,(* నిజం న్యూస్):: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్వేత ప్రియాంక హాస్పిటల్లో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బోయిని జ్యోతి కి ప్రసవం చేయడంలో ఆలస్యం అవ్వడంతో బాబు కడుపులోనే మృతి చెందడంటూ బంధువులు శుక్రవారం ఆందోళన చేశారు. బంధువుల పట్ల, విలేకరుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న డాక్టర్ శ్వేతా ప్రియాంకపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.