ఉపాధి హామీ కూలీల వేతనాలు తక్షణమే చెల్లించాలి

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధిహామీ కూలీలు ధర్నా.
తుంగతుర్తి సెప్టెంబర్ 30 నిజం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం ఉపాధి కార్మికులు పనిచేసిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధి కార్మికులు మాట్లాడుతూ దాదాపు 5, 6 నెలలుగా పనిచేసిన వారికి ఇంతవరకు కూడా ఒక్క వారం కూడా పైసలు పడకపోవడం అధికారులను అడిగిన ఫలితం లేకపోవడం అధికారులు స్పందించి ఉపాధి కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ వెంకన్న రాజు పద్మ మహిళలు పాల్గొన్నారు.