కొండాపూర్ లీఫ్ హాస్పిటల్ లో దారుణం.. !

-డాక్టరుకు బదులుగా నర్స్ వైద్యం.. !

-వైద్యం వికటంచి శిశువు మృతి.. !

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29

శేరిలింగంపల్లి లోని కొండాపూర్ లో నివాసం ఉండే చౌదరి అనే వ్యక్తి ఈ నెల 26-09-2022 రోజు రాత్రి

9 గంటల సమయం లో తన భార్య మౌనిక దివ్య 6 నెలల గర్భవతి కు

నొప్పులు రావడముతో తన నివాసానికి దగ్గర లో ఉన్న కొండాపూర్ లోని లీఫ్ హాస్పిటల్ కు చికిత్స

నిమిత్తము తీసుకొని వెళ్ళగా, డాక్టర్ లేక పోవడముతో డాక్టర్ కు బదులుగా నర్స్ వైద్యం చెయ్యడం తో నొప్పులు ఎక్కువ అవ్వడం తో ఆ మహిళా బాత్రూములో మగ శిశువుకీ జన్మిన్నించింది పుట్టిన 10నిమిషాలకే శిశువు మృతిచెందగా దీనితో హడావడిగా కొండాపూర్ సి ర్ ఫౌండేషన్ శ్మశానవాటికకు శిశువు మృతి దేహాన్ని తరలించారు రెండు రోజులు తరువాత ఈ విషయం బయటకి రావడం తో రంగం లోకి దిగిన పోలీస్ లు శిశువు మృతుదేహాని వెలికి తీశారు.

మృతి చెందిన శిశువు తండ్రి లీఫ్ హాస్పిటల్ యజమాన్యము సిబ్బంది నిర్లక్ష్యం వలన తన శిశువు మరణించాడు అని

హాస్పతి యజమాన్యము పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు