నిజాయితీ చాటుకున్న చిన్నారులు

దొరికిన పర్సు ని పోగొట్టుకున్న వ్యక్తికి చేరవేత
గోదావరిఖని :సెప్టెంబర్ 27:నిజం న్యూస్
రోడ్ పైన ఏదైనా విలువైన వస్తువు దొరికిన డబ్బులు దొరికిన వాటాలు వేసుకునే కాలం లో సమాజం లో నిజాయితీ చాటుకునే వారు ఉన్నారని నిరూపించుకున్నారు ఈ పిల్లలు …. వివరాల్లోకి వెళితే ద్వారకా నగర్ కి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ఎల్కపెళ్లి దేవదాసు తన పర్సును పోగొట్టుకున్నారు ..పర్సు ఎన్టీఆర్ కాలానికి చెందిన కొంత మంది పిల్లలకి దొరకగా దానిలో ఉన్న డబ్బులకి ఆశపడకుండా
పర్సులో లో ఉన్న ఆధార్ కార్డు లోని చిరునామా ద్వారా గుర్తించి పర్సు పోగొట్టుకున్న వ్యక్తి దేవదేసు ఇంటికి వెళ్లి అందచేసి తమ నిజాయితీ చాటుకున్నారు .. కాగా తన పర్సులో వెయ్యి రూపాయల నగదు విలువైన కార్డు లు ఉన్నాయని నిజాయితితో పిల్లలు తమ ఇంటికి తెచ్చి తిరిగి ఇవ్వడం పట్ల దేవదాసు
ఆనందం వ్యక్తం చేసి చిన్నారులు శ్రీమన్నారాయణ పుష్పజీత్ సాయి చరణ్ కుమార్ లని అభినందించారు .