బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 )నిజం న్యూస్)
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో…..
*బతుకమ్మ చీరలో ఔన్నత్యం!!*
బట్టనేసే మగ్గం ఆగిపోకుండా నేతన్నల
ప్రాణా దారం తెగిపోకుండా తెలంగాణ బతుకమ్మ చీరలు పురుడు పోసుకున్నాయి..!
ఆరు గజాల తెలంగాణ బతుకమ్మ చీరలు
ఏడు వర్ణాల హరివిల్లు రూపంలో తెలంగాణ
బతుకమ్మ చీరలు పురుడు పోసుకున్నాయి..!
తెలంగాణ ఆడపడుచులు పంచవన్నే చీరలు
కట్టి బతుకమ్మ ఆడగా తెలంగాణ బతుకమ్మ
చీరలు పురుడు పోసుకున్నాయి..!
తెలంగాణ ఆడపడుచుల వెన్నలంచు కుచ్చిళ్ళ మాటున వోదిగిన సిరిమువ్వల సవ్వడితోబతుకమ్మ ఆడగా తెలంగాణ బతుకమ్మ చీరలు పురుడు పోసుకున్నాయి..
గుడి గంటల రవళిలో శృతి కలుపుతూ
మగువలు బతుకమ్మ ఆడగా తెలంగాణ
బతుకమ్మ చీరలు పురుడు పోసుకున్నాయి..!
*మంజుల పత్తిపాటి కవయిత్రి*
మాన్నేవారి తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా
*ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్..*