బతుకమ్మ వేళ ఖాళీ బిందెలతో తాగు నీటి కోసం నిరసన

గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని మహిళల వేడుకోలు.
ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామం లో బతుకమ్మ పండుగ రోజు తాగునీటి సమస్యపై కాలి బిందెలతో మహిళలు ఏకంగా నిరసన. ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తాము ఏ పాపం చేశామని నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ని అడిగితే పట్టించుకోకపోవడం దురదృష్ట అన్నారు.
20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. విన్నవించిన పట్టించుకోవడం లేదు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బతుకమ్మ ఆడాల్సిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేయడం గమనార్హం తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించాలని మహిళలు కోరుతున్నారు.