పురుగుల అన్నం పలుసని చారు వద్దే వద్దు

పురుగుల అన్నం పలుసని చారు వద్దే వద్దు విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

చిగురుమామిడి/సెప్టెంబర్.23 (నిజం న్యూస్)

చిగురుమామిడి మండల పరిధిలోని సీఎం దత్తత గ్రామమైన చిన్న ముల్కనూరులో మాడల్ స్కూల్లో గత మూడు నెలలుగా విద్యార్థులకు పురుగుల అన్నంతో పాటు పలుచని చారును వడ్డిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకు లపై శుక్రవారం ఆందోళనకు దిగారు,మోడల్ స్కూల్లో వడ్డిస్తున్న భోజనంలో పురుగులు లేకుండా చూడాలని అన్నారు ఇదే విషయంపై ప్రిన్సిపాల్ కు వివరణ ఇచ్చారు పురుగులు లేని నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్ ను కోరారు ఈ నేపథ్యంలో వంట నిర్వాహకులు కలగచేసుకుని తల్లిదండ్రుల పట్ల అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు దీనితో ఆగ్రహించిన తల్లిదండ్రులు వెంటనే ఈ విషయంపై న్యాయం జరగాలని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు దీంతో ఇరు ప్రక్కల వాహనాలు అరగంట సేపు వాహ నిలిచిపోయాయి ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగింది విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ కొత్త వినిత టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ను అలాగే,ఎంఈఓ ను రప్పించి వీరికి న్యాయం జరగాలని అన్నారు వెంటనే వారిని రాస్తారోకోను విరివింపజేసి విద్యార్థులకున్యాయం జరిగేటట్టుగా చూస్తానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో తాసిల్దార్. ఎంపీడీవో. విద్యా కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్. స్థానిక ఎంపీటీసీ పెసర జమున. ఉప సర్పంచ్ నరేష్. తెరాస మండల అధ్యక్షులు మామిడి అంజయ్య. ఉపాధ్యక్షులు పెసరి రాజేశం. పిలిపించి ఇకనుండి పొరపాటు జరగకుండా చూడాలని అధికారులను కోరారు.