కబ్జా కోరులు పై ఉక్కుపాదం మోపిన రెవిన్యూ అధికారులు

-మియాపూర్ మక్తా లోని కబ్జా ని తొలిగించిన రెవిన్యూ అధికారులు..
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24,(నిజం న్యూస్ ):
శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోని సర్వే నెంబర్ 77 లోని ప్రభుత్వ భూమి ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారన్న విషయాన్ని తెలుసుకున్న రెవిన్యూ అధికారులు హుటాహుటిన శుక్రవారం రోజు అక్కడికి చేరుకొని జె సి బి సాయం తో చుట్టూ ఉన్న రేకులను తొలగించారు దాదాపు 12గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా గురివ్వకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు ఈ 12గుంటల భూమిని రాత్రి కి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే గ్రామస్తుల ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే స్పందించిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ శీనయ్య అద్వర్యం లో రేకులని తొలగించారు ఇలాంటి కబ్జాలకు యత్నిస్తే తగిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు