Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బోధన్ లో విద్యార్థిపై దాడి చేసిన టీచర్

ప్రజ్ఞ అనే ప్రైవేట్ పాఠశాలలో క్రాంతి అనే విద్యార్థి పై రావు అనే టీచర్ విచక్షణారహితంగా దాడి,,,

బోధన్లో ఓవైపు కాలేజీలలో మరోవైపు హైస్కూల్లో విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది,,,

ప్రైవేటు పాఠశాల కళాశాలలో విద్యార్థుల పై దాడులు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న వ్యవహారాలు,,,

మితిమీరిపోతున్న ప్రవేటు పాఠశాలల, కళాశాలల ఆగడాలు

నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 24 నిజం న్యూస్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆటో నగర్ లో ఉండే ప్రజ్ఞ హై స్కూల్ లో రావు అనే టీచర్ ఎనిమిదో తరగతి చదువుతున్న క్రాంతి అనే విద్యార్థి పై విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది, గతంలో బోధన్ పట్టణంలోని కొన్ని కళాశాలలు కూడా విద్యార్థులపై దాడి చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన వ్యవహారాలు జిల్లాలో సంచలనం రేకెత్తించిన అంశం గా మారాయి, బోధన్ పట్టణంలో కొన్ని కళాశాలలో, కొన్ని పాఠశాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతోందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఖర్చు చేసి ఎన్నో డబ్బులు వెచ్చించి, తమ తమ పిల్లలకు మంచి

విద్యను అందించాలనే లక్ష్యంతో, అప్పులు తెచ్చి మరీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తుంటే, ప్రైవేటు కళాశాలలు ‘పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని మంచి అహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తామని అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మబలికి తీర కళాశాల ,పాఠశాల ల లో చేరిన తర్వాత ఓ వైపు విద్యార్థులు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు పరాభవ మోసమే జరుగుతుందని విమర్శలు లేకపోలేదు. ఓవైపు ఫీజుల కోసం, ఇతర కారణాల వల్ల విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా మరో వైపు అధిక ఫీజుల కోసం విద్యార్థులు, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు చీటికిమాటికి ఇబ్బందులపాలు చేయటం ఆనవాయితీగా మార్చుకున్నారని, విద్యార్థులు మంచి విద్యాబోధన ఏమో కానీ ఓ వైపు ఫీజులు మరోవైపు ఇతర కారణాల వల్ల దాడులు చేయటం, ఇలాంటి అంశాల్లో విద్యార్థులు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక చిత్రవధ పరిస్థితులు అనుభవిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. బోధన్ పట్టణం ఆటో నగర్ లో ఉన్న ప్రజ్ఞ హై స్కూల్ లో క్రాంతి అనే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో బయలాజికల్ సబ్జెక్టు టీచర్ రావు విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తోటి విద్యార్థులు భయాందోళనలకు గురి అవుతున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి ఎంత మొత్తుకున్నా వినకుండా టీచర్ దారుణంగా దాడి చేయడం, తీవ్ర దాడులతో ఉన్న విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో, సారంగాపూర్ గ్రామం నుంచి వారి తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకోగానే సదరు ప్రిన్సిపాల్ మాత్రం దాడి చేసిన టీచర్ ను మాయం చేశారని పలువురు ఆరోపించారు, చేసేది ఏమీ లేక విద్యార్థి ఆయన తల్లిదండ్రులు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కోసం వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా సిఐ ప్రేమ్కుమార్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా విద్యార్థిపై దాడి చేసిన సంఘటన జరిగిందంటూ ఫిర్యాదు ఇవ్వడానికి టౌన్ పోలీస్ స్టేషన్ కు రావటం జరిగిందని చివరికి వారు ఫిర్యాదు ఇంకా ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ శాంత కుమారిని చరవాణి ద్వారా వివరణ కోరగా తాను సెలవుల్లో ఉన్నానని తనకు ఈ విషయం తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కీ చరవాణి ద్వారా వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ చేయిస్తామని సమాధానమిచ్చారు. గత కొన్ని రోజుల క్రితం రెండు కళాశాలలకు చెందిన యాజమాన్యం విద్యార్థుల పై దాడి చేయడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన వ్యవహారాలు మానక ముందే మళ్లీ ఈ సంఘటన జరగడం బోధన్ లో కొన్ని ప్రైవేటు పాఠశాల కొన్ని కళాశాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొన్నిచోట్ల నిబంధనకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు, అర్హతలేని ఉపాధ్యాయులతో, ఎలాంటి సౌకర్యాలు ,ఆటస్థలం , ఫైర్ సేఫ్టీ సౌకర్యం లేని విధంగా కొనసాగిస్తున్న వైనం ఓవైపు విద్యార్థులకు మరోవైపు వారి తల్లిదండ్రులకు ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.