వలిగొండ గ్రామపంచాయతీ సెక్రెటరిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి 

వలిగొండ సెప్టెంబర్ 23 నిజం న్యూస్ వలిగొండ గ్రామపంచాయతీ సెక్రెటరీ నిధుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తుండడంతో సెక్రెటరీ సస్పెండ్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గురువారం నాడు ఉతర్వులు జారీ చేశారు మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి తమ ఇంటి యజమాని పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోగా వలిగొండ గ్రామపంచాయతీ కార్యదర్శి డి బ్రహ్మచారి తమ నుంచి లంచం తీసుకున్నారని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు విచారణ అధికారి గ్రామ పంచాయతీ సెక్రెటరీ విచారణ కోరగా సరియైన సమాధానం ఇవ్వకపోవడంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 2018 సెక్షన్ 51 19 కింద సస్పెన్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు