ఆడబిడ్డలకు దసరా కానుక బతుకమ్మ చీర

తుంగతుర్తి, సెప్టెంబర్ 23 నిజం న్యూస్

తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండ గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడబిడ్డలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను శుక్రవారం పంపిణీ చేసిన..జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు అనంతరం మాట్లాడుతూ ,ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ , చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ దసరా కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం మనందరి అదృష్టమని అన్నారు.. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలిసే విధంగా కృషి చేయడం మనందరి బాధ్యత అని అన్నారు. మండలంలో సుమారు 15 వేల 4 42 మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు,స్థానిక ఎంపిటిసి ఆంబోతు నరేష్, స్థానిక సర్పంచ్, ఈరోజు నాయక్ ,తహసీల్దార్, రామ్ ప్రసాద్ ఎంపీడీఓ, భీమ్ సింగ్ నాయక్, గుండగాని రాములు గౌడ్ తడకమళ్ళ రవికుమార్, కిరణ్, వెంకన్న, భాస్కర్ నాయక్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.