ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో జేఈఈ నీట్ లో అత్యధిక ర్యాంకులు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అభినందనలు తెలుపుతున్న పేద విద్యార్థులు ,తల్లిదండ్రులు.
ఢిల్లీ, సెప్టెంబర్ 22 నిజం న్యూస్
కనీసం నాణ్యమైన విద్యను ఇవ్వకుండా సమాజం , దేశం ఎలా వృద్ది చెందుతుంది. ఎన్నికలు రాగానే నాయకుల ప్రలోభాలకు గురికాకుండా మానవ జీవన ప్రమాణాలు పెంచే పథకాలు ఎలాంటి దీన స్థతిలో ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, మన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను చూడండి.
70 సంవత్సరాల్లో దేశ చరిత్రలో మన దేశం ఎంత ఘనంగా అభివృద్ధి చెందిందో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్య బోధను చూస్తే తెలుస్తుంది ప్రభుత్వ. పాఠశాలలోని విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ, నీట్ లలో అత్యధిక ర్యాంకులను పొందుటకు కృషిచేసిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభినందనలు తెలపక తప్పదు.
ప్రైవేట్ పాఠశాలకు ఎవరి(ప్రభుత్వం) మీద నమ్మకం లేక పంపిచారో ఆలోచించండి. అలాంటపుడు ఓటు అనే ఆయుధాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం.
70 సంవత్సరాల్లో దేశ చరిత్రలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. మనం ప్రభుత్వ పాఠశాలల్లో నేటి సమాజానికి తగిన నాణ్యమైన విద్యను అన్ని వర్గాల కుటుంబాలకు అందించనంత వరకు మనం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాం .
కాబట్టి దేశములోని రాష్ట్ర లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పక తప్పదు సుమా.. నూతన విద్యా విధానాన్ని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ ప్రజలంతా సెల్యూట్ చేయవలసిందే…..