సొంత ఖర్చులు, వాహనాలతో.. సద్ది మూట పట్టుకుని వచ్చిన బహుజనులు

మునుగోడులో బిఎస్పి నాయకుల హంగామా
హైదరాబాద్ సెప్టెంబర్ 22 నిజం న్యూస్
మునుగోడు లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుగోడులో మీటింగ్ కోసం వచ్చిన జనం,
ఏ ఒక్కరు కూడా ఏదో ఆశించి రాలేదు వారి స్వంత ఖర్చులతో…సద్ది మూట తోవచ్చిన జనం..
అరె ఇది నిజమేనా అంటే నిజమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడూ చెప్పుతూ ఉంటాడు
వర్తమానం లో పనిచేస్తూ భవిష్యత్తును అందరికంటే ముందే పసిగట్టే వాడు మాత్రమే ఏదైనా సాధించ గలడు అని,బహుజన రాజ్యాధికార యాత్ర – బహుజన సామాజ్ పార్టీ BSP RSP లో సర్ మాట్లాడే మాటలు ప్రతిదీ శాస్త్రీయంగా స్టాటేటీజకల్ గా ఉంటాయి తప్ప ఎదో కళ్లి బొల్లి మాటలు ఉండవు.
ఏదైతే అంటారో అది చేసి చూపిస్తారు..
గురుకులాలల్లో మొదటగా అందరూ ఏమి చేస్తాడులే అని, అనుకున్నారు కానీ రాష్ట్రం లో ఉన్న ప్రతి స్కూల్ స్కూల్ పరిస్థితి అక్కడ ప్రిన్సిపాల్ ఎవ్వరు ఎలాంటి వారు అని అన్ని క్షణాల్లో చెప్పే అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎస్ పి.
పేద వర్గాల పరిస్థితి ని క్షుణంగా పరిశీలించిన వ్యక్తి
పేద వర్గాల ప్రజల కోసం 7 సంవత్సరాల ఉద్యోగం ను తృణపాయంగా వదిలేసిన వ్యక్తి ఉద్యోగం లో ఉంటే డీజీపీ అయ్యే వారు అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ
పేద వర్గాలు ఏదైతే ఉచిత నాణ్యమైన విద్య కు మరియు వైద్యం కు దూరం అవుతున్నాయి
ఎదో కూలీ,నలి తో సంపాదించిన ఆ డబ్బులు క్షణాల్లో అయిపోతున్నాయి..
మనం పేద వర్గాల తరుపున ఎందుకు పోరాటం చెయ్యకూడదు
ఓట్లు మావి బీసీ, ఎస్సీ,మైనారిటీ వర్గాల వారివే
మరి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కూడా ఈ వర్గాల వారికే ఎక్కువ….
అందరికి నాణ్యమైన ఉచిత,విద్య,వైద్యమే లక్ష్యంగా ఇంటికి ఒక్క రూపాయి ఇచ్చిన సరే మనం ప్రవీణ్ సర్ ను ఎన్నుకోవాలి లేదా 500 తీసుకొని వేరే వారికి మన ఓటును అమ్ముకుంటే రేపు మన పిల్లల విద్య,వైద్యం కు మనం ఎంత సంపాదించినకార్పొరేట్ విద్యను అందించలేము…
కాబట్టిమనం ఇంటికి 10 సర్ కోసం త్యాగం చేసి గెలిపించుకుంటే రేపటి మన పిల్లల భవిష్యత్తు కు భయపడే అవసరం లేదు….
సర్ ఏజెండా అదే
ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం ఉపాధి….
(ఈ మూడు చాలు ఏవి మనకు అవసరం లేదు)…
మునుగొడు లో మన బహుజనుల్లో ప్రతి ఇంటికి గడప కు వెళదాం సర్ త్యాగం, మన భవిష్యత్తు పై భరోసా పై వారికి అవగాహన కలిపిద్దాం.. బహుజన సమాజ్ పార్టీ నాయకులు అంటున్న విషయాలు మాధ్యమాల్లో వైరల్గా మారాయి… ఏది ఏమైనా మునుగోడులో ఆర్ ఎస్ పి కార్యక్రమంలో
వేల జనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ,ఎవరి సద్ది వాళ్లదే ,ఎవరి బండి (కార్) వాళ్లదే ఈ జనం చూసాక మునుగోడు గొడవ తీర్చే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని నిజం న్యూస్ ముచ్చటించారు…