Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుల నెత్తిమీద గుళికల శఠగోపం??

ఎరువుల యాజమాన్యం తో మమేకమై డబ్బులు డీలు చేసిన రా బంధువులు.

తలా పాపం…. తిలా పిడికెడు అయిన వైనం.

రైతుల బాధలు మరిచిన ,వ్యవసాయ శాఖ అధికారులు.

తుంగతుర్తి, సెప్టెంబర్ 20 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువుల షాపులో ఎటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ, మండల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం తో ఎరువుల షాపు యాజమాన్యం ఇష్టారాజ్యంగా సాగుతున్నారు…

ఒకపక్క అకాల వర్షంతో రైతులు వేసిన పంటలు నష్టపోయి అల్లాడుతుంటే, మరోపక్క ఎరువుల

మందు దుకాణదారులు యూరియా కోసం రైతులు వెళితే అవసరం లేకుండా, ఐదు కిలోల గుళికలు

తీసుకుంటేనే యూరియా ఇస్తామంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది రైతులు చేసేదేమీలేక గుళికలు కొనుక్కొని యూరియా ని తీసుకు వెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల షాపులనుపర్యవేక్షించాల్సిన అధికారులు ఖరీఫ్ సీజన్ మొదట్లో తూ. తూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులుదులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

కొంత మంది స్థానిక రాబందులు, షాపు యాజమాన్యంతో మాట్లాడి ఏకంగా పెద్ద మొత్తంలో రూపాయల ముడుపులు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి… దీనిలో స్థానిక అధికారుల పాత్ర కూడా ఉండడంతో పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎరువుల యాజమాన్యం తరపున, అధికారుల నిర్లక్ష్యంతో ఎరువుల షాపుల వైపు

అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ,ఎరువుల షాపుల యజమానుల ఇష్టారాజ్యంగా రైతులను

దొచుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులను ఇష్టముంటే కొను లేకపోతే లేదు, అంటూ

ఇబ్బందులు పెడుతుండడంతో తప్పని పరిస్థితుల్లో అవసరం లేకున్నా యూరియా కోసం అదనపు

డబ్బులు వెచ్చిస్తే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇది మొత్తం అధికారులు కనుసన్నల్లో

జరుగుతున్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో వరి, పత్తి, మిర్చి తదితర పంటలు భారీ స్థాయిలో

రైతులు సాగు చేశారు. అకాల వర్షానికి రైతులు వేసిన పంటలకు తెగుళ్లు సోకడంతో వ్యవసాయ

అధికారుల సంప్రదించడానికి కార్యాలయం వెళితే అధికారులు అందుబాటులో ఉండటం లేదని తప్పని

పరిస్థితుల్లో తాము ఎరువుల దుకాణదారులను తెగుళ్లు పోవడానికి సంప్రదిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఇబ్బందులు పెడుతున్నఏరువుల షాపుల యజమానులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవలసిన అవశ్యకత ఉందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

యూరియా బస్తా కావాలంటే గుళికలు కొనాల్సిందే అని షాపు యజమానులు అమ్ముతున్నట్లు నా దృష్టికి రైతులు తీసుక రాలేదు.. తక్షణమే విచారణ జరిపి ,యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాము.

తుంగతుర్తి వ్యవసాయ శాఖ సంచాలకులు జగ్గు నాయక్.